మీకోసం న్యూస్ | సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లి
బ్రాహ్మణపల్లి: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం (ZBNF) పై అవగాహన కార్యక్రమం బ్రాహ్మణపల్లిలో నిర్వహించారు.
ఈ కార్యక్రమం గౌరవ బీసీ సంక్షేమశాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ ఆదేశాల మేరకు నిర్వహించబడింది. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వేణుగోపాల్, పందిపర్తి శ్రీనివాస్ రెడ్డి, శాంతరాజు, మంచేపల్లి, పందిపర్తి, బ్రాహ్మణపల్లి గ్రామాల రైతులు, స్థానిక నాయకులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సహజ వ్యవసాయ పద్ధతుల ప్రయోజనాలు, సాగులో ఖర్చు తగ్గింపు, దిగుబడుల నాణ్యత పెంపు వంటి అంశాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
– మీకోసం న్యూస్

0 కామెంట్లు