సోమందేపల్లి, జూలై 8 (మీకోసం న్యూస్):
సోమందేపల్లి మండల పంచాయతీ కార్యాలయంలో బీఎల్ఓలు (BLOలు), బీఎల్ఏలు (BLAలు)తో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ, SIR కార్యక్రమానికి సమయం చాలా తక్కువగా ఉన్నందున ప్రతి ఓటరు తమ బూత్ పరిధిలోని BLOను కలిసి ఓటరు వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదై ఉండేలా BLOలు, BLAలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
అనంతరం మండలంలో SIR కార్యక్రమం పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, పెండింగ్లో ఉన్న ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో తహసీల్దార్ మారుతి, ఎంపీడీవో వెంకటలక్ష్మి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు, మండల కన్వీనర్ వెంకటేష్, టౌన్ అధ్యక్షుడు సురేష్, మాజీ కన్వీనర్ సిద్ధలింగప్పతో పాటు BLOలు, BLAలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

0 కామెంట్లు