హిందూపురం, మీకోసం న్యూస్:
హిందూపురం పట్టణంలోని మేలాపురం సర్కిల్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, భక్తిశ్రద్ధలతో నమస్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత, హిందూ ధర్మ పరిరక్షణలో చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. యువత శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ సామాజిక సంఘాల ప్రతినిధులు, శివాజీ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

0 కామెంట్‌లు