రొద్దం, జూలై 6 (మీకోసం న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని నారనాగేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాచూరు, జక్కలచెరువు గ్రామాల్లో SIR కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ధృవీకరణ చేపట్టారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఆదేశాల మేరకు బూత్ నంబర్–6 పరిధిలో ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన ధృవీకరణ ప్రక్రియ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్ర, డీలర్ నరసింహరెడ్డి, నాగిరెడ్డి, యల్లప్ప, అరుణ, హరీష్, అభి, సుబ్రహ్మణ్యం, ఈడిగ ముత్యాలు తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

0 కామెంట్లు