హిందూ స్మశానానికి దారి చూపండి

 మీకోసం న్యూస్ | సోమందేపల్లి



రహదారి లేక ఇబ్బందుల్లో గ్రామస్తులు – వెంటనే శాశ్వత పరిష్కారం కోరుతున్న ప్రజలు

సోమందేపల్లి, జూలై 6: సోమందేపల్లి గ్రామంలోని హిందూ స్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఓ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్మశానానికి తీసుకెళ్లాల్సి రావడంతో ప్రత్యామ్నాయ మార్గం లేక జాతీయ రహదారిపైనే శవయాత్ర నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హైవేపై శవయాత్ర సాగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మశానానికి వెళ్లే దారిలేక ప్రతి అంత్యక్రియ సమయంలో ఇదే సమస్య పునరావృతమవుతోందని గ్రామస్తులు వాపోతున్నారు.

ప్రజల ప్రాథమిక అవసరాల్లో స్మశానానికి రహదారి కూడా ఒకటేనని, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి హిందూ స్మశాన వాటికకు శాశ్వత రహదారి నిర్మించి సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు