సోమందేపల్లి, జూలై 7:(మీకోసం న్యూస్ )
సోమందేపల్లి మండలం సోమందేపల్లి గ్రామానికి చెందిన ఈ. మల్లమ్మ (భర్త: చిక్కప్పయ్య) ఎన్నాళ్లుగానో పట్టాదారు పాసుపుస్తకాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మారుతి వెంటనే స్పందించి, బాధితురాలిని పిలిపించి సమస్యపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
భూ రికార్డులను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సర్వే నంబర్ 118/2/2లో 2.2300 ఎకరాలు, సర్వే నంబర్ 88/6Aలో 0.08 ఎకరాలకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను మంజూరు చేసి బాధితురాలికి అందజేశారు.
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమస్యకు తక్షణ పరిష్కారం లభించడంతో మల్లమ్మ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. రైతుల సమస్యలపై వెంటనే స్పందిస్తూ పరిష్కార మార్గం చూపిన తహసీల్దార్ మారుతిని గ్రామస్థులు అభినందించారు.
"రైతు సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం... అర్హులెవరూ ఇబ్బంది పడకుండా సేవలు అందిస్తాం" అని ఈ సందర్భంగా తహసీల్దార్ మారుతి తెలిపారు.

0 కామెంట్‌లు