మీకోసం NEWS తేదీ లోడ్ అవుతోంది…|సమయం --:--
హోమ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ జాతీయం భక్తి సినిమా
తాజా వార్తలు
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

నూతన ఎంపీపీ, జెడ్పీటీసీలకు ఆత్మీయ సన్మానం

గెలుపొందిన ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించిన మాజీ ఎంపీటీసీ కిష్టప్ప

సోమందేపల్లి,మీకోసం న్యూస్ ,నవంబర్ 14:

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఎంపీపీగా ఎన్నికైన నీరుగంటి చంద్రశేఖర్, జెడ్పీటీసీగా గెలుపొందిన సిద్ధలింగప్పలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

మండలంలోని జె.జె.ఆర్. నగర్‌లో మాజీ ఎంపీటీసీ కిష్టప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

పలువురు నాయకులు, కార్యకర్తల హాజరు

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, జనసేన పార్టీ హిందూపురం పార్లమెంటు స్థానిక సంస్థల నిర్వహణ కమిటీ సభ్యులు రంగేపల్లి నాగరాజు, సాయినగర్ సుబ్బు, ఏ.బి. ఆంజనేయులు, జనసేన పార్టీ పెనుకొండ అసెంబ్లీ నిర్వహణ సభ్యులు వెంకటేశులు, తిరుమలేశు, బి. సంజీవ రాయుడు, అలివేలమ్మ, నబీ రసూల్, పందిపర్తి మాజీ ఎంపీటీసీ మూర్తి, శ్రీనివాసులు, కదిరప్ప, నరసింహమూర్తి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు