సవితమ్మ ఆధ్వర్యంలో ఇంచార్జి మంత్రిని కలిసిన టీడీపీ నేతలు


 

గోరంట్ల, జూలై 1(మీకోసం న్యూస్ ): శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జి మంత్రి, రెవెన్యూ-రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను గోరంట్లకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి ఎస్. సవిత ఆధ్వర్యంలో మంత్రి స్వగృహంలో జరిగిన ఈ సమావేశంలో గోరంట్ల టీడీపీ సీనియర్ నాయకులు, సిక్స్ మ్యాన్ కమిటీ సభ్యులు గిరిధర్ గౌడ్, షేక్ అజ్మతుల్లా, బీ.ఆర్. వేణుగోపాల్ రాయల్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాసులు, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతం తదితర అంశాలపై మంత్రితో నాయకులు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు