రోడ్లపై పశువులకు ట్యాగింగ్.. యజమానులకు పోలీసుల హెచ్చరిక

 




సోమందేపల్లి,జూలై 2( మీకోసం న్యూస్): రోడ్లపై స్వేచ్ఛగా సంచరించే పశువుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సోమందేపల్లి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పశువుల యజమానులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేయడంతో పాటు, పశుసంవర్ధక శాఖ సహకారంతో ప్రతి పశువుకు గుర్తింపు ఇయర్ ట్యాగ్ అమర్చారు.
గత కొన్నేళ్లుగా రోడ్లపై తిరిగే పశువుల వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవడం, పలువురు గాయపడటం, కొందరు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా వారపు సంత రోజున ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు.
ఇకపై రోడ్లపై సంచరించే పశువులను గుర్తింపు ట్యాగ్ ఆధారంగా యజమానులను గుర్తించి, బైండోవర్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 లక్షల వరకు బాండ్ మొత్తాన్ని ఫోర్‌ఫీచర్ చేయడంతో పాటు, అవసరమైతే న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు పంపే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు