సోమందేపల్లి జూన్ 03 (మీకోసం న్యూస్ ): శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నల్లగొండరాయనిపల్లి గ్రామంలో శుక్రవారం కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో 'కెనరా స్త్రీ శక్తి' కార్యక్రమం నిర్వహించారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే జీవనోపాధి అభివృద్ధి కోసం రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను 0.75 శాతం వడ్డీ రాయితీతో అందజేస్తామని కెనరా బ్యాంకు రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఏడుగురు లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది అనిరుద్ రెడ్డి, చిరంజీవి, ప్రభానందిని, మాగేచెరువు శాఖ మేనేజర్ శేఖర్, వెలుగు ఏపీఎం మదన్మోహన్, సీసీ శంకర్, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


0 కామెంట్‌లు