అనంతపురం జూలై 03 (మీకోసం న్యూస్ )17న నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ ప్రజాప్రతినిధులను శుక్రవారం మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
అనంతపురంలోని వారి నివాసంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు , హిందూపురం పార్లమెంట్ సభ్యులు , రాప్తాడు ఎమ్మెల్యే , పుట్టపర్తి మాజీ మంత్రి లను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఛత్రపతి శివాజీ సేవా ట్రస్ట్ మరియు వానర సేన ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కేవీ చలపతి, ఉపాధ్యక్షులు శివన్న, రామకృష్ణ, రఘుతో పాటు వానర సేన సభ్యులు పాల్గొన్నారు.




0 కామెంట్‌లు