వేగంగా సాగుతున్న SIR అవగాహన కార్యక్రమం రెండు పంచాయతీల్లో ఓటర్లకు విస్తృత అవగాహన కల్పించిన డీవీ ఆంజనేయులు


 సోమందేపల్లి, జూలై 2(మీకోసం న్యూస్ ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతి భారతీయ పౌరుడు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర బోయ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు అన్నారు.  సోమందేపల్లి గ్రామం 196, 197, 198 బూత్‌లు, అలాగే  వెలగమాకలపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఓటర్లకు 2002లో ఓటు నమోదు వివరాలు, తల్లిదండ్రుల ఓటరు నమోదు సమాచారం, మొదటిసారి ఓటు నమోదు చేసిన స్థలం, ఓటరు వివరాల్లో మార్పులు, చేర్పులు, చిరునామా మార్పులకు వినియోగించాల్సిన దరఖాస్తు ఫారాలు, ఓటరు మ్యాపింగ్ విధానం తదితర అంశాలను సవివరంగా వివరించారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని డీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు