చిరుద్యోగులపై కలెక్టర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: సీఐటీయూ


 పెనుకొండ, జూలై 2(మీకోసం న్యూస్ ): జిల్లాలో నిర్వహించిన ఓటర్ల సమీక్ష సమావేశంలో క్రింది స్థాయి ఉద్యోగుల పట్ల జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. పెనుకొండ పట్టణంలోని సివిల్ సప్లై కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. ఓబులు మాట్లాడుతూ, ఉద్యోగులను ఉద్దేశించి "తన్నండి, కొట్టండి" అనే తరహా వ్యాఖ్యలు చేయడం కలెక్టర్ హోదాకు తగదని విమర్శించారు.

కలెక్టర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల పక్షాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కలెక్టర్ కూడా ప్రభుత్వ ఉద్యోగేననే విషయాన్ని గుర్తుంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జడ్పీ శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి జీఎల్ నరసింహులు, నాయకులు లక్ష్మీనారాయణ, సాంబశివ, గంగాధర్, బాబా, దిల్షాద్, ముత్యాలు, బాబ్జాన్, నాగరాజు, రాము, అయూబ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు