ఏపీకి మరో 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్

మీకోసం న్యూస్ I అమరావతి 

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య విస్తరణకు మరో కీలక అడుగు పడింది. జాతీయ వైద్య కమిషన్ (NMC) రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి మంజూరు చేసింది. ఇందులో కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరు ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించింది. దీంతో కడప కళాశాలలో మొత్తం సీట్లు 175 నుంచి 250కు, నెల్లూరు ఏసీఎస్‌ఆర్ కళాశాలలో 175 నుంచి 200కు పెరిగాయి. 

రాష్ట్రంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేయడం, వైద్య విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు కల్పించడంలో ఈ నిర్ణయం కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధి, అధ్యాపకుల నియామకం, ఎన్‌ఎంసీ ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఫలితంగానే ఈ అనుమతులు లభించాయని ఆయన పేర్కొన్నారు. 


 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు