లోకేశ్‌కు పెళ్లి ఆహ్వానం అందజేసిన బండ్ల గణేశ్ ఆగస్టు 16న కుమార్తె జనని వివాహానికి రావాలని ఆహ్వానం


 హైదరాబాద్ (మీకోసం న్యూస్ ): ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తన కుమార్తె జనని వివాహ మహోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

ఈ విషయాన్ని బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. లోకేశ్‌ను కలవడం ఆనందంగా ఉందని, తన కుమార్తె వివాహ వేడుకకు హాజరు కావాలని ఆహ్వానించినట్లు పోస్టులో పేర్కొన్నారు.

జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి సూర్యతేజతో ఆగస్టు 16న జరగనుంది. ఈ ఏడాది మే 3న హైదరాబాద్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

-మీకోసం న్యూస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు