పెనుకొండ: పావగడ నుంచి పెనుకొండకు బయలుదేరిన మాజీ మంత్రి ఉషశ్రీని పోలీసులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
పెనుకొండకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఉషశ్రీ, తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు మద్దతుగా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మీకోసం న్యూస్ | ప్రతి క్షణం ప్రజల కోసం

0 కామెంట్‌లు