'ఛలో రాప్తాడు' పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు.. జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన బందోబస్తు

 

    మీకోసం న్యూస్ I సోమందేపల్లి 

పెనుకొండ/సోమందేపల్లి/అనంతపురం, జూలై 9: వైసీపీ ఇచ్చిన 'ఛలో రాప్తాడు' పిలుపు నేపథ్యంలో అనంతపురం జిల్లాతో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు కీలక ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు.
అనంతపురం పట్టణంలోని 80 ఫీట్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గుంపులుగా చేరిన వారిని చెదరగొడుతూ శాంతిభద్రతలు కాపాడాలని హెచ్చరిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి అదనపు పోలీసు బలగాలను తరలించినట్లు సమాచారం.
ఇక శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద కూడా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రాప్తాడు వైపు వెళ్లే వాహనాలను ఆపి పరిశీలిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
శాంతిభద్రతల దృష్ట్యా ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారుల సూచనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు