మీకోసం న్యూస్ I జూలై 09
న్యూస్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నవోదయ విద్యాలయ సమితి సూచించింది.
ప్రవేశాలు జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST–2027)లో సాధించిన ప్రతిభ ఆధారంగా కల్పించనున్నారు. సంబంధిత జిల్లాకు చెందిన విద్యార్థులు 2026–27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మొత్తం సీట్లలో 75 శాతం కేటాయించగా, బాలికలకు మూడో వంతు సీట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు అమలులో ఉంటాయి.
అభ్యర్థులు 2015 మే 1 నుంచి 2017 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. అలాగే 3, 4, 5వ తరగతులను గ్రామీణ పాఠశాలల్లో అభ్యసించిన విద్యార్థులు గ్రామీణ కోటాకు అర్హులవుతారు.
ముఖ్య తేదీలు
దరఖాస్తుల చివరి తేదీ: 31-07-2026
ఫలితాలు: 2027 మార్చి/ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం
నాణ్యమైన ఉచిత నివాస విద్యను అందించే నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం పొందేందుకు అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

0 కామెంట్‌లు