మీకోసం న్యూస్ I సోమందేపల్లి
సోమందేపల్లి, జూలై 8: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని సోమందేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కె.వి. ఉషశ్రీ చరణ్ ఆదేశాల మేరకు మండల కన్వీనర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేతగా వైఎస్సార్ సేవలను నాయకులు స్మరించుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

0 కామెంట్లు