సోమందేపల్లి, జూలై 24 (మీకోసం న్యూస్):
చేనేత కార్మికులకు నేతన్న సేవా పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తూ శుక్రవారం సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో కూటమి నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి సవిత చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కన్వీనర్ వెంకటేశులు ఆధ్వర్యం వహించగా, రాష్ట్ర ఉప్పర సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, నాయకుడు నీరుగంటి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాత్రింబవళ్లు శ్రమించి పట్టు చీరలు నేసే చేనేత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, నేతన్న సేవా పథకం ద్వారా ప్రతి అర్హ చేనేతకు రూ.25 వేల సాయం అందించడం చేనేత రంగానికి ఊతమిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వడ్డే సూరి, పి.ఎన్. రామాంజి, జనసేన కన్వీనర్ జబి, గంగాధర్, రంగేపల్లి నాగరాజు, శివశంకర్ యాదవ్, వడ్డీ శివప్ప, మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, గట్టు మహేంద్ర, డీలర్లు బాలు, పరందమ, పూజారి మురళి, అమర్నాథ్ యాదవ్, డా. సోమశేఖర్, మద్దిలేటి, అనసూయ, సుమిత్ర రాయల్, సుజాత, శిరీషతో పాటు పలువురు చేనేత కార్మికులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు