జీవో 396, పీపీపీ విధానానికి వ్యతిరేకంగా దస్తావేజు లేఖరుల నిరసన

ధర్మవరంలో పెన్‌డౌన్.. మాల మహానాడు, మానవ సంక్షేమ ఐక్యవేదిక సంఘీభావం


ధర్మవరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానం, జీవో ఎంఎస్ నెం.396కు వ్యతిరేకంగా ధర్మవరం దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్‌డౌన్ నిరసనకు రాష్ట్ర మానవ సంక్షేమ ఐక్యవేదిక, ఉమ్మడి అనంతపురం (అనంతపురం–శ్రీ సత్యసాయి) జిల్లా ఏపీ మాల మహానాడు కమిటీ సంఘీభావం ప్రకటించాయి.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా ధర్మవరంలో నిర్వహించిన శిబిరంలో నాయకులు పాల్గొన్నారు. అనంతరం కళాజ్యోతి సర్కిల్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జీవో 396ను ఉపసంహరించుకోవడంతో పాటు పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దస్తావేజు లేఖరుల జీవనోపాధికి భంగం కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ధర్మవరం దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జూటూరు మహేంద్ర, రాష్ట్ర మాలల సంక్షేమ ఐక్యవేదిక అధ్యక్షుడు డా. కోట్ల గంగాధర్, అనంతపురం జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు సుగమంచి శ్రీనివాసులు, శ్రీ సత్యసాయి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు ఎం.ఎన్. మూర్తి, ముఖ్య సలహాదారు సోదనపల్లి రామాంజనేయులు, జై భీమ్ భారత్ పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మద్దెల ఈశ్వర్, జిల్లా మాల మహానాడు నాయకులు వెంకట్రాముడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు