గోరంట్ల, జూలై 24 (మీకోసం న్యూస్):
రాష్ట్ర మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు గోరంట్ల మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, వానవోలు, పులేరు ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ (4.0) సమావేశంలో గుత్తా బాలకృష్ణ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకంపై విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖి చర్చ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు తమ తల్లిదండ్రులను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే, మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలోని ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని 9, 10వ తరగతి విద్యార్థులకు డైరీలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సోమశేఖర్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్ ప్రసాద్, శ్రీ సత్యసాయి జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు జీఎం సురేష్, జనసేన మండల అధ్యక్షుడు సంతోష్, బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, పాఠశాల కమిటీ చైర్మన్ నరసింహతో పాటు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు