చాలకూరులో గ్రామసభ నిర్వహణ – పీఎంఏవై ఆవాస్ ప్లస్ లబ్ధిదారుల ఎంపికపై చర్చ

 

సోమందేపల్లి, జూలై 7 (మీకోసం న్యూస్ ): పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామపంచాయతీలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ ప్లస్ (PMAY Awaas Plus–2024) పథకం కింద లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు, గృహాల మంజూరుకు సంబంధించిన అంశాలపై గ్రామస్తులతో చర్చించారు.

ఈ కార్యక్రమానికి ఉప్పర సాగర కార్పొరేషన్ చైర్మన్ రామన్న, చాలకూరు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి, తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, సచివాలయ సిబ్బంది, హౌసింగ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

గ్రామాభివృద్ధి, గృహ నిర్మాణ పథకాల అమలులో ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

కార్యక్రమంలో హనుమంతప్ప, రామాంజినేయులు, రవిశేఖర్ రెడ్డి, చెరువు కమిటీ అధ్యక్షుడు లక్ష్మీనరసప్ప, తిరుమలేశప్ప తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు