లంచ్ విరామ సమయానికి 91 పరుగులతో అజేయంగా ఉన్న యస్తికా.. తిరిగి ఆట ప్రారంభమైన తర్వాత ధైర్యంగా బ్యాటింగ్ కొనసాగించింది. ఇస్సీ వాంగ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఆమె, అనంతరం సింగిల్‌తో 145 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో తన తొలి అంతర్జాతీయ టెస్ట్ సెంచరీని పూర్తి చేసింది. శతకం సాధించిన వెంటనే భావోద్వేగానికి గురైన యస్తికా మైదానంలో మోకాళ్లపై కూర్చొని పిచ్‌ను ముద్దాడగా, ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు.
కెరీర్‌కే ముప్పుగా మారిన ఏసీఎల్ మోకాలి గాయం నుంచి కోలుకొని ఈ ఇంగ్లండ్ పర్యటనతోనే జట్టులోకి తిరిగి వచ్చిన యస్తికా.. తన పునరాగమనాన్ని ఈ చారిత్రక ఇన్నింగ్స్‌తో ఘనంగా చాటుకుంది. మ్యాచ్ తొలి బంతికే వికెట్లు తాకినా బెయిల్స్ పడకపోవడంతో ఆమెకు లభించిన జీవితాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుత శతకం నమోదు చేసింది.
ఇదే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఇప్పటికే లార్డ్స్ ఆనర్స్ బోర్డులో చోటు దక్కించుకున్న భారత బౌలర్ క్రాంతి గౌడ్ సరసన, సెంచరీతో యస్తికా భాటియా కూడా ఆనర్స్ బోర్డులో స్థానం సంపాదించింది.
– మీకోసం న్యూస్

0 కామెంట్‌లు