అనంతపురం ఎస్సీ మోర్చా జిల్లా ఇన్‌చార్జిగా నియామకంనాయకుల చేతుల మీదుగా ఘన సన్మానం

ధర్మవరం, జూలై 12 (మీకోసం న్యూస్):
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం అనంతపురం జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా ఇన్‌చార్జిగా నియమితులైన నాయకుడిని పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జోనల్ ఇన్‌చార్జి దయాకర్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కనుగురి నీలకంఠం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసి దేవనంద్, రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బసవరాజు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
నూతన బాధ్యతలను పార్టీ ఆశయాలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఎస్సీ మోర్చాను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నియమిత జిల్లా ఇన్‌చార్జి ఈ సందర్భంగా తెలిపారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు