మాజీ సర్పంచ్ నివాసంలో నాయకుల ఆత్మీయ విందు

శ్రీ సత్యసాయి జిల్లా | గోరంట్ల

పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మలసముద్రం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సువర్ణ–అశ్వర్థ రెడ్డి దంపతుల ఆహ్వానం మేరకు వారి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు పలువురు టీడీపీ నాయకులు, మహిళా నేతలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుబ్బు రత్నమ్మ, జిల్లా అధికార ప్రతినిధి నరసింహులు, పెనుకొండ పట్టణ మాజీ కన్వీనర్ రవిశంకర్, డ్వాక్రా–అంగన్‌వాడీ మహిళా ఉపాధ్యక్షురాలు నాగమణి అశ్వత్, నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు లీలమ్మ, జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జావేద్ భాషా, క్రిస్టియన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆండ్రిసు, చంద్రమౌళి, నాగరాజు, సానిపల్లి వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, గోనిపెంట వెంకటేష్, మునిమడుగు రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు పరస్పరం ఆత్మీయంగా కలుసుకుని నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు