పెనుకొండ, జూలై 12: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR-2026 ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం, పరిగి మండల కేంద్రాల్లో ఆదివారం మిస్సింగ్ ఓట్ల గుర్తింపు, నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
రాష్ట్ర మంత్రి సవితమ్మ సూచనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పెనుకొండ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, అనిమేటర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, సంబంధిత అధికారులతో సమావేశమై కార్యక్రమ పురోగతిని సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్లు, రాష్ట్ర డైరెక్టర్లు, మండల 5-మెన్ కమిటీ సభ్యులు, ఎంఆర్వోలు, ఎంపీడీవోలు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.
మండలాల పరిధిలోని ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరై తమ పేర్లను బూత్‌ల వారీగా పరిశీలించుకుని, మిస్సింగ్ ఓట్ల నమోదు, సవరణ ప్రక్రియలో పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బంది, అలాగే చురుకుగా స్పందించిన ఓటర్లను డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
— మీకోసం న్యూస్

0 కామెంట్‌లు