మీకోసం న్యూస్ అమరావతి
అమరావతి: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 109 గురుకులాలు పనిచేస్తుండగా, ఈ విద్యాసంవత్సరంలో మరో 10 కొత్త బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇప్పటికే ఆరు ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే రూ.500 కోట్ల సాస్కి నిధులతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
బీసీ హాస్టళ్ల స్థానంలో దశలవారీగా గురుకులాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఎంజేపీ పాఠశాలలు, బీసీ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
అదనంగా తరగతి గదులు, విశ్రాంతి గదుల్లో దోమ తెరలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.
— మీకోసం న్యూస్

0 కామెంట్‌లు