ఉరుముల కళాకారుల కుటుంబాలకు మాల మహానాడు ఓదార్పుఆర్థిక సాయం అందించి అండగా ఉంటామని భరోసా

కళ్యాణదుర్గం/కుందుర్పి, జూలై 24 (మీకోసం న్యూస్):

మరణించిన ఉరుముల కళాకారుల కుటుంబాలను పరామర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు నాయకులు శుక్రవారం "ఓదార్పు–పరామర్శించు కార్యక్రమం" నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం వర్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఉరుముల ఓబులేసు కుటుంబాన్ని, కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఉరుముల మాల గంగాధర కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన నాయకులు, భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అండదండలుగా నిలుస్తామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర శాశ్వత ఉపాధ్యక్షుడు దళితరత్న ఎస్‌కేయూ ఓబులేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు పోలీస్ చెన్నప్ప, జిల్లా మహిళా అధ్యక్షురాలు సాకే శ్రీదేవి, జిల్లా అధ్యక్షుడు బేతాల శరత్, ఉరుముల కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి పూలకుంట రాము, జిల్లా ఉప కార్యదర్శి కుందుర్పి మల్లికార్జున, నగర ఉపాధ్యక్షుడు బి. సురేంద్ర, నగర ప్రధాన కార్యదర్శి వల్లూరు బాబు, ఉరుముల కళాకారుల నాయకులు పూలకుంట లక్ష్మీనారాయణ, వర్లి నారాయణప్ప, శ్రీనివాసులు, తెనగల్లు రమేష్ తదితరులు, మహిళలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు