సోమందేపల్లి: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక "స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర" కార్యక్రమాన్ని శనివారం సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ప్రతి నెల మూడో శనివారం చేపట్టే ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ పాఠశాల ప్రహరీ గోడలపై సందేశాత్మక వాల్ పెయింటింగ్‌లు వేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా జామ, ఉసిరి మొక్కలను నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బి. రామకృష్ణ, ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, జనసేన నాయకుడు రంగేపల్లి నాగరాజు, ఈవోఆర్డీ ప్రేమ్‌కుమార్, వీవీజీ & జీఎపీఓ సోమశేఖర్‌రెడ్డి, రూరల్ వాటర్ సప్లై మండల కోఆర్డినేటర్ జగదీష్, పంచాయతీ కార్యదర్శులు, డ్రాయింగ్ టీచర్ విజయవాణి, క్రాఫ్ట్ టీచర్ రంగేపల్లి రమేష్, పారిశుధ్య కార్మికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-మీకోసం న్యూస్
0 కామెంట్‌లు