కుందిర్పి, జూలై 12 (మీకోసం న్యూస్): ప్రముఖ నేపథ్య గాయని, గానకోకిల ఎస్. జానకి మృతి పట్ల కుందిర్పి గ్రామంలో పలువురు కళాకారులు, సామాజిక సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల మైసూరులో చికిత్స పొందుతూ కన్నుమూసిన జానకమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
గ్రామ నడిబొడ్డున ఉన్న శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం వద్ద ఉరుముల కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు పూలకుంట చియ్యేడు రాము, ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కౌన్సిలర్ వీరప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జానకమ్మ తెలుగు సినీ సంగీతానికి చేసిన విశిష్ట సేవలను కొనియాడారు.
1938లో జన్మించిన జానకమ్మ 2026లో పరమపదించారు. తన సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో దాదాపు 50 వేల పాటలు ఆలపించి భారతీయ సినీ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేశారని, ఆమె మధుర గానం ఎప్పటికీ సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందని వక్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉరుముల కళాకారుల నాయకులు మహాదేవ, ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు జిల్లా ఉప కార్యదర్శి మల్లికార్జున, అనంతపురం జిల్లా అధ్యక్షుడు బేతాల శరత్, తెనగాళ్లు కిషోర్, ఉరుముల కళాకారులు ఈరన్న, చిరంజీవి, ఓబులేసు, కుందిర్పి మండల మాలమహానాడు సభ్యులు సురేష్, మర్రిస్వామి, వెంకటేష్, సోమనాథ్, అనిమేటర్ లక్ష్మీదేవమ్మ, మహిళలు హనుమక్క, తులసమ్మ, తిప్పమ్మ తదితరులు పాల్గొని జానకమ్మకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

0 కామెంట్‌లు