పైసా కొట్టు.. డైలాగ్ పట్టు! ప్రకాశ్ రాజ్‌కు బండ్ల గణేశ్ ఘాటు కౌంటర్


 హైదరాబాద్, జూలై 12 (మీకోసం న్యూస్): నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోకు సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఘాటుగా స్పందించారు. ప్రజల మనసు గెలవాలంటే స్క్రిప్ట్ కాదు, నిజాయతీ కావాలని వ్యాఖ్యానిస్తూ ప్రకాశ్ రాజ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రకాశ్ రాజ్ తనపై జరుగుతున్న విమర్శలు, తప్పుడు ప్రచారాలకు సమాధానంగా ఎక్స్ వేదికగా వీడియో పోస్టు చేశారు. "ప్రశ్నించే గొంతుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి నా సమాధానం" అంటూ ఆయన స్పందించారు.

దీనికి బండ్ల గణేశ్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, "ఎవరితోనో ట్వీట్ రాయించుకుని వచ్చి పోస్ట్ చేయడం కాదు. సినిమాల్లో రాసిచ్చిన డైలాగ్ చెప్పినట్టు కాదు.. ప్రజలతో మాట్లాడే మాట హృదయం నుంచి రావాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. ప్రజల మనసు గెలవాలంటే స్క్రిప్ట్ కాదు... నిజాయతీ కావాలి, తమ్ముడూ!" అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, "పైసా కొట్టు.. డైలాగ్ పట్టు! ప్రకాశ్ రాయ్ అలియాస్ ప్రకాశ్ రాజ్, ఫ్రమ్ కర్ణాటక" అంటూ మరో పోస్టులో సెటైర్లు వేశారు.

ఈ పోస్టులతో ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగుతుండగా, అభిమానులు కూడా తమ అభిప్రాయాలను పెద్ద ఎత్తున పంచుకుంటున్నారు.

-మీకోసం న్యూస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు