డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నివాళులు
శ్రీ సత్యసాయి జిల్లా జూలై 06 ( మీకోసం న్యూస్ ): భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్ అధ్యక్షతన జిల్లా ఎస్సీ మోర్చా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయి వరకు పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంతో పాటు ఎస్సీ వర్గాల సంక్షేమం, సాధికారత కోసం అంకితభావంతో పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజల మధ్య సేవాభావంతో పనిచేసి సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
అనంతరం డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్‌తో కలిసి ముఖర్జీ దేశానికి అందించిన సేవలను స్మరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సాకే ఓబులేసు, హరికృష్ణ గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజ్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్, సీనియర్ నాయకుడు ఉత్తమ్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


0 కామెంట్లు