SVIMSలో బీఎస్సీ నర్సింగ్, అలైడ్ హెల్త్ కోర్సుల అడ్మిషన్లు ప్రారంభం


మీకోసం న్యూస్|ప్రతినిధి|ప్రకాష్ 

తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS), తిరుపతి 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT), బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్‌లో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్, మెడికల్ రేడియో ఇమేజింగ్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ పల్మనరీ పర్‌ఫ్యూషన్, ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, డయాలసిస్ థెరపీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, న్యూరోఫిజియాలజీ, రేడియేషన్ థెరపీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి కోర్సుకు నిర్ణీత సంఖ్యలో సీట్లు కేటాయించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన AP EAPCET-2026లో అర్హత సాధించి ర్యాంకు పొందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు AP Online కేంద్రాలు లేదా SVIMS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 8, 2026గా నిర్ణయించారు. కోర్సులు, అర్హతలు, ఫీజులు, సీట్ల వివరాలు మరియు ఇతర సమాచారం కోసం SVIMS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

-మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు