సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మీకోసం న్యూస్, హిందూపురం, ఆగస్టు 15: హిందూపురం పట్టణంలోని సిపిఐ కాలనీలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ హిందూపురం పట్టణ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పార్టీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చి, అనంతరం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజలను, సహజ వనరులను దోచుకున్నారని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని గుర్తుచేశారు.

భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, ఝాన్సీ లక్ష్మీబాయి, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు తదితర మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకుని దేశ సేవకు అంకితం కావాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

పొట్టి రోడ్డులోనూ జెండా ఆవిష్కరణ

సిపిఐ కాలనీ పొట్టి రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో డి. బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను వివరించి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో సిపిఐ కార్యవర్గ సభ్యులు సమీవుల్లా, కమల్ భాష, శ్రీనివాసులు, చాంద్ బాషా, నౌషాద్, ఇమ్రాన్, సాబీరా, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు