మీకోసం న్యూస్ | తిరుపతి
తిరుమల, జూలై 5: అచంచల భక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు కాలినడకన తిరుమలకు చేరుకోవడం భక్తులను కదిలించింది. కర్ణాటకకు చెందిన ఈ వృద్ధురాలు అలిపిరి మెట్ల మార్గం గుండా శ్రీవారి దర్శనం కోసం చేసిన యాత్ర ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈ ఘటనపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆ వృద్ధ భక్తురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఆమె పూర్తి వివరాలు తమ వద్ద లేవని, తెలిసిన వారు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఆ వృద్ధ భక్తురాలిపై, ఆమె కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని బీఆర్ నాయుడు ఆకాంక్షించారు. వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా శ్రీవారి దర్శనం కోసం చేసిన ఆమె భక్తి యాత్ర ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

0 కామెంట్‌లు