శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బాచన్నపల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణమూర్తికి చెందిన రెండు కాడెద్దులు ఈ రోజు పాముకాటుకు గురై మృతి చెందాయి. పొలంలో మేత మేస్తున్న సమయంలో విషసర్పం కాటేయడంతో రెండు ఎద్దులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు తెలిపారు.
మృతిచెందిన రెండు కాడెద్దుల విలువ సుమారు రూ.1.75 లక్షలు ఉంటుందని, ఈ ఘటనతో రైతు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశాడు. సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
వ్యవసాయ పనులకు ప్రధాన ఆధారంగా ఉన్న కాడెద్దులు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.


0 కామెంట్‌లు