పాలసముద్రం వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.1 లక్ష విరాళం


 గోరంట్ల: మండలంలోని పాలసముద్రం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి పెయ్యాల రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని గోరంట్ల మండల వైఎస్సార్‌సీపీ నాయకుడు నర్సింపల్లి పి.వి. శివారెడ్డి చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతృత్వాన్ని అభినందించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి అనుగ్రహం పెయ్యాల రామలింగారెడ్డి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ విరాళం ఉపయోగపడుతుందని తెలిపారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు