గోరంట్ల: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ యాజమాన్యం విద్యను వ్యాపారంగా మార్చి, కండోనేషన్ ఫీజు పేరుతో విద్యార్థులను వేధిస్తోందని పీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్ర ఆరోపించారు.
ఫీజులు చెల్లించలేని విద్యార్థులను ప్రాక్టికల్, సెమిస్టర్ పరీక్షలకు అనుమతించకుండా వారి విద్యా భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆయన విమర్శించారు. కండోనేషన్ ఫీజు వసూళ్లపై ఉన్నత విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి, అర్హులైన విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
లేదంటే బాధిత విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పీఎస్‌యూ నేతలు హెచ్చరించారు.
– మీకోసం న్యూస్

0 కామెంట్‌లు