ప్రయాణికులకు గమనిక.. రేపు చాకార్లపల్లి రైల్వే గేటు బంద్




మీకోసం న్యూస్  చాకర్లపల్లి 
 సోమందేపల్లి, జూలై 13: సోమందేపల్లి మండలంలోని చాకార్లపల్లి రైల్వే గేటును రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గేటు వద్ద అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

మరమ్మత్తు పనులు పూర్తయ్యే వరకు గేటు గుండా అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో వాహనదారులు, స్థానిక ప్రజలు ముందస్తు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.

ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని రైల్వే అధికారులు, స్థానిక పోలీసులు విజ్ఞప్తి చేశారు. పనులు పూర్తయిన వెంటనే గేటు ద్వారా యథావిధిగా రాకపోకలకు అనుమతి కల్పిస్తామని తెలిపారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు