పెనుకొండ, జూలై 22 (మీకోసం న్యూస్): పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ సైదా బాను క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో వైద్య ఖర్చుల కోసం పెనుకొండ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మను ఆశ్రయించారు.
విషయాన్ని తెలుసుకున్న మంత్రి సవితమ్మ వెంటనే స్పందించి సీఎంఆర్‌ఎఫ్ (CMRF) ద్వారా ఎల్‌ఓసీ (LOC) మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో కేవలం 24 గంటల్లోనే రూ.3.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరై బాధిత కుటుంబానికి అందజేశారు.
ప్రస్తుతం షేక్ సైదా బాను తిరుపతిలోని అష్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె భర్త షేక్ అజంతుల్లా ఎల్‌ఓసీ లేఖను స్వీకరించారు.
ఈ సందర్భంగా షేక్ అజంతుల్లా మాట్లాడుతూ, తమ ఆర్థిక ఇబ్బందులను వివరించగానే మంత్రి సవితమ్మ తక్షణమే స్పందించి ఒక్క రోజులోనే రూ.3.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సహాయం అందించారని తెలిపారు. ఈ సహాయాన్ని తమ కుటుంబం ఎప్పటికీ మరచిపోదని, మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.
– మీకోసం న్యూస్
0 కామెంట్‌లు