తల్లికి వందనం నగదు జమపై సంబరాలు నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం.. మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు

పెనుకొండ, జూలై 22 (మీకోసం న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం కింద విద్యార్థినుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13,000 చొప్పున నగదు జమ కావడంతో పెనుకొండ పట్టణంలోని ఎమ్‌జేపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో బుధవారం సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థినుల తల్లులు, విద్యార్థులు కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా పెనుకొండ మున్సిపాలిటీ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 0.18 టీఎంసీ నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడం మంత్రి సవితమ్మ ప్రత్యేక కృషి ఫలితమేనని ఎన్డీయే కూటమి నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో పట్టణ ప్రజలకు దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, మంత్రి సవితమ్మకు మున్సిపాలిటీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, నాయకులు ప్రభంజన్ కుమార్, హుజూరుల్లా ఖాన్, షౌకత్, సలీం బాషా, బీజేపీ నాయకుడు రామకృష్ణ, జనసేన నాయకులు శ్రీదేవి, లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్యం, బోయ నంజుండ, బోయ సోము, మల్లికార్జున, అస్లాం, షఫీక్, వగ్గప్పగారి హరి, ఈ. రాము, సుధీర్, మాధవరెడ్డి, గంగమ్మ, విద్యార్థినుల తల్లులు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, టీడీపీ–బీజేపీ–జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు