వాహన తనిఖీలతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన

సోమందేపల్లి, జూలై 22 (మీకోసం న్యూస్):
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం హిందూపురం రోడ్డు లో సోమందేపల్లి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలను తనిఖీ చేసి, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో సీట్‌బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనం నడపవద్దని, అధిక వేగంతో ప్రయాణించవద్దని అవగాహన కల్పించారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ తెలిపారు. స్థానికులు పోలీసుల సూచనలను స్వాగతించి రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకున్నారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు