గ్యాస్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి

జులై 30న కలెక్టరేట్ ముట్టడికి సీఐటీయూ పిలుపు

అనంతపురం, జులై 19 (మీకోసం న్యూస్): ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ తదితర చట్టబద్ధ సౌకర్యాలను కల్పించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు జులై 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం కరపత్రాలను విడుదల చేసింది.

ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ కార్యదర్శులు బాబ్ జాన్, ముస్తాక్ మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం వంటగ్యాస్‌ను ఇంటింటికీ చేరవేస్తున్న గ్యాస్ డెలివరీ కార్మికులు, ఏజెన్సీల్లో పనిచేస్తున్న సిబ్బంది తక్కువ వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి చట్టబద్ధ హక్కులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

జులై 30న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ డెలివరీ వర్కర్లు పాల్గొన్నారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు