లార్డ్స్‌లో చరిత్ర.. భారత మహిళలకు సచిన్ శభాష్ ఇంగ్లండ్‌పై 270 పరుగుల భారీ విజయం ‘మహిళల క్రికెట్ ప్రస్థానంలో మరో మైలురాయి’


మీకోసం న్యూస్  లండన్: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌పై చారిత్రక టెస్టు విజయాన్ని నమోదు చేసిన భారత మహిళల జట్టుపై క్రికెట్ దిగ్గజం ప్రశంసలు కురిపించారు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌లో తొలిసారిగా జరిగిన మహిళల టెస్టులో భారత్ ఘన విజయం సాధించడం భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని పేర్కొన్నారు.

మ్యాచ్ చివరి రోజు లార్డ్స్‌లో ప్రత్యక్షంగా వీక్షించిన సచిన్, ఆట ప్రారంభానికి ముందు భారత క్రీడాకారిణులతో ముచ్చటించారు. అనంతరం సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘‘ప్రతి క్రికెటర్‌కు లార్డ్స్‌లో ఆడటం ఒక కల. గత నాలుగు రోజులుగా మహిళల టెస్టు క్రికెట్‌కు ఈ వేదిక సాక్ష్యంగా నిలవడం, భారత జట్టు విజయంతో ఆ కల మరింత గొప్పదైంది’’ అని వ్యాఖ్యానించారు.

జట్టు విజయానికి కీలకంగా నిలిచిన వైస్ కెప్టెన్ , సెంచరీ వీరనారి , ఐదు వికెట్లతో మెరిసిన పేసర్ ప్రదర్శనలను సచిన్ ప్రత్యేకంగా అభినందించారు.

457 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 186 పరుగులకే కట్టడి చేసి 270 పరుగుల భారీ తేడాతో విజయం అందించారు. యాస్తిక భాటియా లార్డ్స్‌లో శతకం సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా, క్రాంతి గౌడ్ ఐదు వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్‌గా చరిత్ర సృష్టించారు.

‘‘మహిళల క్రికెట్ అద్భుతంగా ముందుకు సాగుతోంది. ఈ విజయం ఆ ప్రయాణంలో మరో చిరస్మరణీయ మైలురాయి’’ అంటూ సచిన్ భారత జట్టుకు అభినందనలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు