మెగా పీటీఎం–4.0 ఘనంగా నిర్వహణవిద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం ప్రాధాన్యం: నేతలు

రొద్దం, జూలై 25 (మీకోసం న్యూస్): విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా పీటీఎం–4.0 కార్యక్రమం శుక్రవారం రొద్దంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.

పెనుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ తన ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 9వ, 10వ తరగతి విద్యార్థులకు డైరీలను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు టి. మాధవనాయుడు, మండల స్పెషల్ ఆఫీసర్ నరస్సయ్య, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఆంజనేయులు, టీఎన్‌టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు వాల్మీకి చంద్రశేఖర్, పంచాయతీ కన్వీనర్ చిరంజీవి, ఎస్‌ఎంసీ చైర్మన్ వాల్మీకి సురేష్, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీనారాయణమ్మ, డీలర్లు సిద్దన్న, ఆదిశేషు, తెలుగుయువత నాయకుడు మహబూబ్ బాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు