పెనుకొండ, జూలై 25 (మీకోసం న్యూస్): దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్‌డౌన్ కారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయనే ప్రచారం అవాస్తవమని పెనుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం స్పష్టం చేసింది.
పెనుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని గ్రామాల ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం నేరుగా కార్యాలయానికి రావాలని సూచించింది. కార్యాలయ సిబ్బంది దస్తావేజుల తయారీతో పాటు పబ్లిక్ డేటా ఎంట్రీ (PDE) నమోదు ప్రక్రియలో పూర్తి సహకారం అందించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారని వెల్లడించింది.
రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సందేహాలు లేదా ఇతర వివరాల కోసం నేరుగా సబ్ రిజిస్ట్రార్ లేదా కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
– మీకోసం న్యూస్

0 కామెంట్‌లు