పెనుకొండ, జూలై 25 (మీకోసం న్యూస్): పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలుర జిల్లా పరిషత్ సెంట్రల్ స్కూల్, బాలుర ఎంజేపీ గురుకుల పాఠశాల, దర్గాపేట ఉర్దూ పాఠశాల, ఎస్టీ బాలికల రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం–4.0 కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం', 'సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర', 'మిషన్ వాత్సల్య', 'స్త్రీ శక్తి' వంటి పథకాలు విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థినులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా విద్యను ప్రోత్సహించే కీలక చర్యగా అభివర్ణించారు.
విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు ఆమె తండ్రి స్మారకార్థం ఎస్‌ఆర్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 9వ, 10వ తరగతి విద్యార్థులకు ఉచిత డైరీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, టీడీపీ–ఎన్డీయే కూటమి నాయకులు, పోలీసు శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
– మీకోసం న్యూస్

0 కామెంట్‌లు