పెనుకొండలో 85% EF ఫారాల నమోదు పూర్తి 14లోగా మిగిలిన ఫారాలు పూర్తి చేయాలని పిలుపు


 మీకోసం న్యూస్ I పెనుకొండ 

పెనుకొండ, జూలై 11 (మీకోసం న్యూస్): ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన SIR-2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ల సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం పెనుకొండ పట్టణంలోని వివిధ వార్డులు, పోలింగ్ బూత్‌లలో పరిశీలించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సూచనల మేరకు పార్టీ నాయకులు, వార్డు ఇన్‌చార్జీలు, బూత్ కన్వీనర్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్యూమరేషన్ (EF) ఫారాల సేకరణను వేగవంతం చేశారు.

అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను నమోదు చేసుకుని ప్రజాస్వామ్య హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. పెనుకొండ మున్సిపాలిటీలో ఇప్పటికే 85 శాతానికి పైగా ఎన్యూమరేషన్ (EF) ఫారాల నమోదు పూర్తవడంతో పాటు, జిల్లా మున్సిపాలిటీల్లో అత్యధిక ప్రగతి సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన బీఎల్‌వోలు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలను అభినందించారు. ఈ నెల 14వ తేదీ గడువులోగా మిగిలిన అన్ని ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, టీడీపీ మున్సిపల్ కన్వీనర్ శ్రీరాములు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, కౌన్సిలర్లు, బీఎల్‌వోలు, వార్డు ఇన్‌చార్జీలు, బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

"ప్రతి అర్హుడికి ఓటు హక్కు – ప్రతి ఇంటికి SIR-2026 చేరాలి" అనే లక్ష్యంతో మిగిలిన ప్రతి అర్హ ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు