అమరావతి, జూలై 15 (మీకోసం న్యూస్):
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR) విధుల్లో పాల్గొంటున్న బూత్ లెవల్ అధికారులు (BLOలు), BLO సూపర్‌వైజర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) శుభవార్త తెలిపింది. SIR విధులను గుర్తిస్తూ ప్రతి BLO, BLO సూపర్‌వైజర్‌కు ఒక్కసారిగా రూ.6,000 గౌరవ వేతనం (Honorarium) మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే వార్షికంగా BLOలకు రూ.12,000, BLO సూపర్‌వైజర్లకు రూ.18,000 గౌరవ వేతనం అందుతుండగా, తాజాగా మంజూరైన రూ.6 వేల అదనపు పారితోషికంతో BLOలకు మొత్తం రూ.18,000, సూపర్‌వైజర్లకు మొత్తం రూ.24,000 అందనుంది.
ఈ మేరకు మెమో నెం.610/Elecs.B/A1/2026-68, తేదీ: 14-07-2026ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఈ ఉత్తర్వులను అమలు చేసి సంబంధిత BLOలు, సూపర్‌వైజర్లకు నిధులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హైలైట్స్:
▶️ ప్రతి BLOకు అదనంగా రూ.6,000
▶️ ప్రతి BLO సూపర్‌వైజర్‌కు అదనంగా రూ.6,000
▶️ SIR ప్రత్యేక విధులకు గుర్తింపుగా వన్‌టైమ్ హానరేరియం
▶️ జిల్లా కలెక్టర్ల ద్వారా చెల్లింపులు
– మీకోసం న్యూస్
0 కామెంట్‌లు